బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ కొట్టివేత..

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కష్టడీ పిటిషన్ ను న్యాయమూర్తి శుక్రవారం కొట్టివేశారు. గురువారం కస్టడీ పిటిషన్ కు సంబంధించి ఇరువర్గాల న్యాయవాదుల వాదనలను న్యాయమూర్తి విన్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాటికి తీర్పు రిజర్వ్ చేయగా ఈరోజు కస్టడీ పిటిషన్ ను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రద్దు చేయడం జరిగింది. ఇటీవల క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అదిలాబాద్ జిల్లా జైలులో సుమన్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను కస్టడీ నిమిత్తం అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థనను ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సున్నితంగా తోసిపుచ్చారు.

Leave a Reply