జైల్లో నరకం చూపించారు..

జైల్లో నరకం చూపించారు..

  • ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి
  • ప్రజల తీర్పుకు కట్టుబడి ఉండాలి – బాల్క సుమన్

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ ఎన్నికలను స్వాగతించాలని, ప్రజలను గౌరవించాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. మొన్న జరిగిన 22వ వార్డు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10, సీపీఐ కి 4 సీట్లు వచ్చాయని, మిగతా 7 సీట్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలుపొందారని తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం వివేక్ వెంకటస్వామి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ల నియామకాన్ని తిరస్కరిస్తూ, 14 మంది కౌన్సిలర్లలో కొంతమందిని కొనుగోలు చేయాలని కుట్రలు చేశారని ఆరోపించారు. జైల్లో పై అధికారుల ఆదేశాల మేరకు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారని, చదువుకోవడానికి పుస్తకాలు కానీ, రాత్రిపూట కప్పుకోవడానికి చెద్దర్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా పొత్తు ఇప్పటికీ స్థిరంగా ఉంటుంది

వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ మొన్న జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ తో పొట్టు పెట్టుకొని మాకు ఏడు సీట్లు ఇచ్చారు, వాళ్ళు పది సీట్లు తీసుకొని బరిలో నిలవగా టిఆర్ఎస్ కు 10 మాకు నాలుగు సీట్లు వచ్చాయి. మేము అప్పుడు ఇప్పుడు, ఎప్పుడైనా టిఆర్ఎస్కే మద్దతుగా ఉంటామని, చైర్మన్ పదవి టిఆర్ఎస్ కు వైస్ చైర్మన్ పదవి సిపిఐ కి అని మేము అప్పుడు అనుకున్నాము ఇప్పుడు అదే విధంగా మేము వారితో కలిసి ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కలవేని శంకర్, మూలరాజిరెడ్డి, కంభగోని సుదర్శన్ గౌడ్ , బోయినపల్లి అనిల్ రావు, కలువల శ్రీకాంత్, ఆత్మకూరి మహేందర్, మంద వేణుగోపాల్, చరణ్, బొజ్జ శరత్, పోగుల మల్లయ్య,రామడుగు లక్ష్మణ్, ఇప్పకాయల లింగయ్య, కాదండి సాంబయ్య, వనం సత్యనారాయణ, టిఆర్ఎస్ అభిమానులు, సిపిఐ అభిమానులు, మహిళా నాయకురాలు, రాజేశ్వరి, పాల్గొన్నారు.

Leave a Reply