బయ్యారంలో దుర్ఘటన
బయ్యారం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గరిమెళ్ల పంచాయతీ పరిధిలో కంబాలపల్లి(Kambalapally), గరిమెళ్ల గ్రామాల మధ్య ఉన్నలోలెవల్ బ్రిడ్జిపై నుంచి బైక్‌తో దాటుతుండగా వరద ఉధృతికి యువకుడు గల్లంతయ్యాడు. వాగు నీటిలో గల్లంతైన రెడ్యాల గ్రామానికి చెందిన పులి గుజ్జు సంపత్(Gujju Sampath) అనే యువకుడు ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తొలుత బైక్ ఆచూకీ లభ్యమైంది. తర్వాత సంపత్ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన సంపత్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


