ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎంపీ మిథున్‌రెడ్డి (MP Mithun Reddy) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ (remand prisoner)గా ఉన్నారు. ఆయ‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ (interim bail) ల‌భించింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు విజ‌య‌వాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB court) అనుమ‌తి ఇచ్చింది. ఈ నెల 11న తిరిగి స‌రెండ‌ర్ కావాల‌ని ఆదేశించింది. కాగా, సెప్టెంబ‌ర్ 9న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక (Vice Presidential election) జ‌ర‌గ‌నుంది. అదేరోజు ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు. ఎన్డీఏ అభ్య‌ర్థికి వైసీపీ మ‌ద్ద‌తునిచ్చిన విష‌యం తెలిసిందే.

Leave a Reply