ఉట్నూర్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని స్వతంత్ర సమరయోధుడు భారత తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ చౌక్ లో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు ఇతర సంఘాల నాయకులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఆనాటి కాలంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన సేవలు చిరు కాలం నిలుస్తాయని ఆయన చేసిన సేవలను భావితరాల కందించాలని అన్నారు. ఆయన చూపిన మార్గంలోని నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు కొల్లూరు లింగన్న, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బిరుదుల లాజర్, ప్రజా సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోత్ రామారావు, నేతావత్ రాందాస్, లంబాడా కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు భరత్ చౌహన్, టీపీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ చంద్రకాంత్ నాయక్, ఆదివాసి సంఘ నాయకులు భీమ్రావు, దళిత సంఘాల నాయకులు స్వామి గుగ్గిళ్ళ శంకర్ కొమ్ము బాబురావు నాథరాజు గుడిసెల సల్మాన్, బిరుదుల సత్తయ్య,కొమ్మురవి, గుడిసెల మహేష్,జిల్లపెల్లి అశోక్, బచ్చల రవి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply