ప|| అమృత భాండంబును సురా అసురులకు
పంచి యిచ్చిన శ్రీ మోహినీ మోహనుడైన హరునకునూ నీరాజనం.
అను|| అమృత భాండంబు హస్తంబున చిగురాకులు
చేతులుగా ఎంతటి అందంబూ ఆ నగుమోముకు నీరాజనం
చ|| ఆ రూపమ్మునకు పరమేశ్వరుడు ఆనంద ఆశ్చర్య చకితుడయినాడూ.
హరుడు మోహినీని భ్రమింపజేసిన ఆనంద తాండవము
వుప్పొంగినట్టి మోహనాంగికీ హరుడైన మోహనునకూ నీరాజనం.
చ|| ఆ తాండవమ్ముతో అయ్యప్ప జననం హరిహరుల రూపమే మోహినీకీ హరునకునూ నీరాజనం