Ayyappa Swami | వైభవంగా మహా పడిపూజ

Ayyappa Swami | వైభవంగా మహా పడిపూజ
Ayyappa Swami | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : రాజాపేట శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో (temple) ఆదివారం అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. భజన మందిరంలోని సన్నిధానం స్వాములు మంచాల భద్రయ్య, సంధిల భాస్కర్ గౌడ్, బెజుగం శ్రీనివాసులు, నంగునూరు రాజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గురు స్వాములు పెండెం శ్రీనివాసులు (Srinivasulu) సంఘం మల్లేశంలు పూజలు నిర్వహించారు. మొదటగా గణపతి పూజ శ్రీ రామకృష్ణ సాయి మంత్రం ఆలయ అర్చక స్వాములు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ చేపట్టారు. శ్రీ అయ్యప్ప స్వామివారి పాటలు భజనలతో పల్లకీ సేవ స్వామివారికి అభిషేకాలు, అలంకరణ బిక్షా కార్యక్రమం జరిగింది.

