ఆర్మూర్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ పట్టణం పెర్కిట్‌లోని కాంతి హైస్కూల్ లో శనివారం అయ్యప్ప మహా పడి పూజను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అయ్యప్ప గురుస్వామి బల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి, హేమరాణి, ప్రిన్సిపాల్ శశాంక్ రెడ్డి లు పడి పూజ నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు పాల్గొని పదునెట్టాంబడి పూజను నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు డాక్టర్ స్వప్న రాణి బృందం అయ్యప్ప భజనలతో భక్తులను అలరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, గడీల రాములు, పెర్కిట్ మాజీ సర్పంచ్ నల్ల హన్మంత్‌రెడ్డి, పొద్దుటూరి చరణ్‌రెడ్డి, సానిటరీ రాజు, రాం ప్రసాద్, మానస గణేష్, ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, పుష్పాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

