AYYAPPA | 23న మహా దివ్య పడిపూజ మహోత్సవం

కోనేరుసెంటర్లో నిర్వహణ
AYYAPPA | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబర్ 23 (ఆదివారం) కోనేరుసెంటర్లో నిర్వహించే దివ్య మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమానికి నరసరావుపేట కుమారస్వామి వారిచే భజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్పలు, భవానీలు, హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాబా ప్రసాద్, దేసు వెంకట సుబ్రహ్మణ్యం, రామాంజనేయులు, కాంతారావు, గోపాలకృష్ణ, కాట్రగడ్డ రమేష్, వీర వెంకటేశ్వరరావు, కృష్ణ, నాగేంద్రరావు, వెంకట నాగేశ్వరరావు, నారాయణస్వామి, శివప్రసాద్, ఎల్వీ ప్రసాద్, రవిశంకర్ పాల్గొన్నారు.
