కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు
హుస్నాబాద్, ఆంధ్రప్రభ : హుస్నాబాద్ (Husnabad) మండలంలోని, పందిల్ల క్లస్టర్ లోని పొట్లపల్లి గ్రామంలో రైతులకు కపాస్ కిసాన్ యాప్ పైన ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా హుస్నాబాద్ ఏడీఏ కే.మల్లయ్య (ADA K. Mallaiah) మాట్లాడుతూ… రైతులు తాము సాగు చేసిన పంట వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు పర్యటించి డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టడం జరుగుతుందని ప్రతి రైతు తమ పంట వివరాలను పారదర్శకంగా క్రాప్ బుకింగ్ చేయాలని సూచించారు.
కావున ప్రతి రైతు వాస్తవంగా ఏ పంటను అయితే సాగు చేశారో ఆ పంటను మాత్రమే నమోదు చేసుకోవాలని తెలియజేశారు. పత్తి రైతులు పత్తి అమ్మకాల కోసం కపాస్ కిసాన్ యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఓటిపి ఆధారంగా స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి వి. పూజ, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.