రైతులకు అవగాహన సదస్సు

రైతులకు అవగాహన సదస్సు
- 3 సంవత్సరాలు సేద్యం చేస్తే 30 సంవత్సరాలు ఆదాయం వస్తుంది
- రైతు తక్కలపల్లి సత్యనారాయణ రావు
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : మండలం లోని ఇల్లంద గ్రామంలో రైతు తక్కలపల్లి సత్యనారాయణ రావు ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగులో రైతు అవగాహన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉద్యాన అధికారి ఆర్, శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఆయిల్ ఫామ్ సాగులో నీటి యాజమాన్యం, సస్య రక్షణ చర్యలు అధిక ఆదాయం పొందడానికి ఆచరించవలసిన మేలైన యాజమాన్యం గురించి వివరించడం జరిగింది. మూడు సంవత్సరాల దీర్ఘకాలిక పంట ఆయిల్ పామ్, శాశ్వత పంటగా ఆదాయం సమకూరుతుంది. రైతులకు వారసత్వ పంటగా చేసుకోవచ్చు, 30 సంవత్సరాలు ఆదాయం పొందే ఆయిల్ పామ్ పంట, జిల్లాలో 7 వేల ఎకరాలు సాగు అవుతున్నది.
వరంగల్ జిల్లా ఆయిల్ ఫామ్ పంటకు అనుకూలమైన నేలలు, అత్యధిక దిగుబడిని ఇచ్చే పంట భూములు, ఒక చెట్టుకు 25 గెలలు వస్తున్నాయి అని అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే నెల నెల ఆయిల్ పామ్ ద్వారా రైతుకు ఎక్కువ జీతం వచ్చే విధంగా ఆయిల్ పామ్ దిగుబడిని ఇస్తుందని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. రైతులు 12 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లయితే ఫ్యాక్టరీ కట్టిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తక్కలపెళ్లి సత్యనారాయణ రావు మాట్లాడుతూ… సంవత్సరాల తరబడి వ్యవసాయం చేసి పెట్టుబడులు రాక అప్పలపాలు అయ్యి. ఆయిల్ పామ్ ఎంచుకోవడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం, ఆవు దూడ ద్వారా, గో మూత్రం ద్వారా ఆయిల్ పామ్ సాగు చేయడం జరుగుతుందని అన్నారు.
డ్రిప్ ద్వారా చిరుధాన్యాలు అంతర పంటలు వేసి పచ్చిరొట్టగా భూమిలో కలియదున్నీ రసానియక ఎరువులను వాడకం తగ్గింది. ఆయిల్ పామ్ మూడు సంవత్సరాలు కాపాడితే 30 సంవత్సరాలు దిగుబడినీ ఇచ్చే పంట అని అన్నారు. రైతులలో పోటీ తత్వం ఉండాలి కానీ , ఈర్షతత్వం ఉండకూడదని రైతు సత్యనారాయణ రావు అన్నారు.తనకు ఉన్నటువంటి అనుభవాలను రైతులతో పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఫామ్ లో కూలీలకు కొరత ఉండదని ఒక ఎకరానికి నికరంగా 10 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పడం జరిగింది.
రైతులకు ఉన్నటువంటి పలు సందేహాలను కూడా నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అగ్రనమిమిస్ట్ భవాని ప్రసాద్ , రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ సతీష్ నారాయణ ,సర్పంచ్ బేతి సాంబయ్య ఉప సర్పంచ్ బొచ్చు జ్యోతి యాదగిరి , మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి , జిల్లా అధికారులు ,మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్, ఆయిల్ పామ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్స్ కళ్యాణ్, ప్రణయ్, శివమణి , రైతులు కుమారస్వామి దేవేందర్ రావు నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు…
