Awareness | ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన..

Awareness | తిరుపతి, ఆంధ్రప్రభ : నగరంలోని కొదండరామ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ సంజీవ్ కుమార్ బృందంతో కలిసి విద్యార్థులకు ట్రాఫిక్ పై కీలక సూచనలు అందించారు. కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిర్వహణ, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సంకేతాల అర్థం, జీబ్రా లైన్ వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు.

రోడ్లపై నడిచేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడకం గురించి ట్రాఫిక్ సిబ్బంది ప్రాక్టికల్ డెమోతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు విద్యార్థుల కోసం ప్రత్యేక సందేశం అందించారు. రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యతని… చిన్న వయసులోనే ట్రాఫిక్ శిక్షణ పెంపొందితే భవిష్యత్తులో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, స్కూలు అధ్యాపకులు, అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు.
