బాలల హక్కులు, చట్టాలపై అవగాహన

బాలల హక్కులు, చట్టాలపై అవగాహన
ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరూ బాలల హక్కులు బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నారాయణపేట మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కౌన్సిలర్ నక్క విజయ్ కుమార్ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి లో సర్పంచ్ కథలప్ప అధ్యక్షతన బాలల హక్కులు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కులు బాల్యవివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం గ్రామంలో బాల్య వివాహాలు జరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని, 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి పెళ్ళి ప్రయత్నాలు చేస్తే 1098 కి సమాచారం ఇవ్వాలని కోరారు. బాల్యకార్మిక చట్టం చట్టం ప్రకారం బాలకార్మికులతో పని చేయించవద్దని విద్య హక్కు చట్టం అనాధ బాలలు బాలికల ప్రాముఖ్యత మిస్సింగ్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 ఫోన్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమం లో మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప,పంచాయతీ కార్యదర్శి సుమన్ రెడ్డి ఆశాకారకర్తలు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
