యుడైస్ పై అవగాహన సదస్సు
దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరికీ ఈ రోజు జడ్.పి.హెచ్.ఎస్(Z.PHS) దండేపల్లి పాఠశాలలో ఎంఈఓ రాజు ఆధ్వర్యంలో యుడైస్ ప్లేస్(Udice Place) పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో ఉపాధ్యాయులందరికీ యు డైస్ ఫామ్ లో భౌతిక వనరులు (ఫిజికల్ ఫెసిలిటీస్), పిల్లలు, ఉపాధ్యాయులకు సమాచారం ఎలా అందించాలి అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సమాచారం ఆధారంగానే పాఠశాలకు(School) నిధులు సమకూర్చబడతాయని ఎంఈఓ రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రావు , చిన్న నరసయ్య, స్ట్రాంగ్ టీచర్ రమేష్ , టెక్నికల్ పర్సన్ నగేష్, సీఆర్పీలు మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

