హానికర వ్యర్థాలు పై అవగాహన సదస్సు..

గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ ఈరోజు స్థానిక AGK మున్సిపల్ హై స్కూల్ లో నిర్వహించిన సాసా (SASA) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తడి వ్యర్థాలు (Wet Waste), పొడి వ్యర్థాలు (Dry Waste), ఘన వ్యర్థాలు (Solid Waste), ఈ-వెస్ట్ (E-Waste) మరియు హానికర వ్యర్థాల (Harmful Waste) వర్గీకరణపై అవగాహన కల్పించారు. చెత్తను వేరు చేసి ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
పాఠశాలల్లో పరిశుభ్రత మరియు వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంపొందించేందుకు త్వరలోనే వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని మిగతా వార్డులలో కూడా పాఠశాలల్లో సచివాలయం సిబ్బంది విద్యార్థులకు పరిశుభ్రత మరియు వ్యర్థాల వర్గీకరణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు పరిశుభ్రత పై చైతన్యవంతులై, తమ ఇళ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో కూడా చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
