దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్‌కు సన్మానం …

దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్‌కు సన్మానం …
జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ జిల్లా మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షులు జైనూర్ వాసి మహాలే దత్త మాంగ్ కు శనివారం జైనూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సన్ రైస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్ జమీల్, ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్ చేసిన సేవలను గుర్తించి దళిత రత్న అవార్డు ఇవ్వడం ఎంతో గర్వకారణమని సన్రైజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ షేక్ జమీల్, జైనూర్ మాజీ వైస్ ఎంపీపీ రషీద్ నాయకులు అన్నారు. ఇలాగే సమాజ సేవలు చేస్తూ మరిన్ని అవార్డులు తీసుకొని ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్నావార్ పవన్ కుమార్, సుద్దాల శ్రీనివాస్, వార్డు మెంబర్లు షేక్ రహీం, భూతాలే కిరణ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
