ఔషధి పథకం.. ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మకం

ఔషధి పథకం.. ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మకం

ఆరోగ్య సేవలను ప్రతి కుటుంబానికి చేరవేయడం మా లక్ష్యం
అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ , ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన ఔషధి పథకం ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక నిర్ణయమని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు తున్న రోగుల కు, వృద్ధులకు, పేద కుటుంబాలకు ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తమవుతుందని అన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతం లో ఏర్పాటు చేసిన ప్రధాన్ మంత్రి భార తీయ జన ఔషధి కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ ప్రారంభించారు. కేంద్రంలోని మందుల నిల్వలు, సదుపాయాల ను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణ ప్రజలు ఎక్కువ ఖర్చుతో మందులు కొనుగోలు చేయాల్సిన పరి స్థితి ఉండగా, ఇప్పుడు అదే నాణ్య త కలిగిన ఔషధా లు 50 శాతం నుండి 90 శాతం వరకు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం గొప్ప విషయమని తెలిపారు.

ఈ కేంద్రంలో 2000కు పైగా నాణ్యమైన జనరిక్ ఔషధాలు, 300కు పైగా సర్జికల్ పరికరాలు అం దుబాటులో ఉన్నా యని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయక త్వంలో దేశవ్యాప్తంగా వేలాది జన ఔషధి కేంద్రాలు ప్రారంభమవు తున్నాయని, ఆరోగ్య సేవలను ప్రతి కుటుంబా నికి చేరవేయడం లక్ష్య మని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలో నాణ్య మైన మందులు పొందా లని ఆయన పిలుపు నిచ్చారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో మరిన్ని జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జన ఔషధి కేంద్ర యజమా నులు రాథోడ్ ఆశ, రాథోడ్ అక్షయ్ లకు ఎమ్మెల్యే హృదయపూర్వక శుభా కాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అం దించే ఈ సేవా కార్యక్ర మాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ వైష్ణవి, సుధ , 45వ డివి జన్ కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ, వేణు, 19 డివిజన్ కార్పొరేటర్ నాగోల్లా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.

Leave a Reply