ఎస్పీ కార్యాలయంలో దారుణం..
వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో దారుణం జరిగింది. పోలీస్ వాహనాలను శుభ్రం చేస్తుండగా హోమ్ గార్డ్ శ్రీనివాస్ కు కరెంట్ షాక్ కొట్టింది. దీంతో శ్రీనివాస్ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్లకు చెందిన శ్రీనివాస్. ఆసుపత్రిలో మృతదేహాన్ని ఎస్పీ నారాయణ రెడ్డి పరిశీలించారు.

