Atkuru | ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ..

Atkuru | ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ..

Atkuru, ఉంగుటూరు, ఆంధ్రప్రభ : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ట్యాలీ కోర్సులో శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతితో పాటు పౌష్టికాహారాన్ని ట్రస్టు నిర్వాహకులు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply