ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటా

మంథని రూరల్, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు ముందు ఉంటానని మల్లారం గ్రామ సర్పంచ్ పొట్ల లక్ష్మీ తెలిపారు. బుధవారం మంథని మండలం మల్లారం గ్రామ సర్పంచ్ పొట్ల లక్ష్మీ గ్రామంలో కరెంటు స్తంభాలు సమస్యగా ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులకు తెలుపగా వారు వెంటనే స్పందించి నూతన స్తంభాలు అమర్చారు. సర్పంచ్ తనయుడు పొట్ల శ్రీకాంత్ స్వయంగా దగ్గరుండి మరి పని చేయించారు. సర్పంచ్ లక్ష్మి గ్రామంలోని అంగన్వాడి పాఠశాలల సందర్శించి సౌకర్యాల గురించి ఆరా తీశారు. సర్పంచ్ ప్రతి చిన్న సమస్యకు స్పందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply