పిచ్చాటూరు, (ఆంధ్రప్రభ) : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో బంగాళా పంచాయితీ మలగుంట గ్రామంలో నిల్వ నీరు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం అధికారులు సిబ్బందితో కలిసి నిల్వ నీటిని పూర్తిగా తొలగించారు. గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో డ్రెయినేజీ మార్గాలను శుభ్రపరిచారు. తహసీల్దార్ టి.వి. సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో మహ్మద్ రఫీ పర్యవేక్షణలో పనులు పూర్తయ్యాయి. అధికారులు గ్రామస్తులకు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆ టైమ్ లో.. అప్రమత్తంగా ఉండాలి..

