STAFF | ఇంటి వద్దకే..

STAFF | ఇంటి వద్దకే..

STAFF | అనంతపురం బ్యూరో, ఆంధ్ర ప్రభ : బుక్కరాయసముద్రం మండలంలోని రేకులకుంట గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ (NTR) భరోసా పథకం లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో 1వ తేదీ పెన్షన్ వస్తోందా, సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, తదితర వివరాలను ఆరా తీశారు. 1 వతేదీ పెన్షన్ వస్తోందని, సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని, పెన్షన్ డబ్బులు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను (Pension) పంపిణీ చేయడం జరుగుతోందని.. జిల్లాలో సజావుగా పెన్షన్ల పంపిణీ చేపట్టడం జరుగుతోందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను తెలియజేయగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దాసరి సునీత, తహసీల్దార్ శ్రీధర్ మూర్తి, ఎంపిడిఓ సాల్మన్, డిప్యూటీ ఎంపిడిఓ సదాశివ, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply