ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ
గన్నేరువరం, ఆంధ్రప్రభ : నూతన ఎంపీడీవో(MPDO)గా ఏ. శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి(Pegadapalle) మండలం నుండి బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు.
సిబ్బందికి(staff) పలు సూచనలు చేస్తూ విధులలో పారదర్శకంగా పనిచేయలన్నారు. ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్య పనులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. కార్యాలయ సిబ్బంది, ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

