మహిళలను గౌరవించుకోవాలి….

మహిళలను గౌరవించుకోవాలి….

పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ గిద్యోను ప్రార్ధనా మందిరం ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ. మంగలపూడి జోసెఫ్ పాల్గొని పలువురు వివిధ రంగాలలో పని చేస్తున్న మహిళలను శాలువతో ఘనంగా సన్మానించారు.స్త్రీలను గౌరవించాలన్నదే పరిశుద్ధ గ్రంథము బైబిల్ చెపుతున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘ కాపరి ఎన్.అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. మాకినేని బసవ పున్నయ్య స్టేడియం వాకర్స్ అసోసియేషన్,మాకినేని బసవ పున్నయ్య స్టేడియం యోగా వాకర్స్ అసోసియేషన్ సంయుక్తముగా నిర్వహించి వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన మహిళలను సన్మానించారు.

ఈకార్యక్రమంలో వాకర్స ఇంటర్నేషనల్ గవర్నర్ కె. శ్రీనివాసరాజు,వాకర్స ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్ ఎం5.బి.జి.ఎమ్ ప్రసాద్ ,యోగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నూర్జహాన్, కార్యదర్శి సుజాత, ట్రెజర్ వి. గౌతమి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply