గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర అతికీలకం

గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర అతికీలకం
.. కామారెడ్డి డిఆర్డిఓ సురేందర్
జుక్కల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకమని డిఆర్డిఓ సురేంద్ర అన్నారు. గురువారంనాడు ఎంపీడీఓ సమావేశం మందిరంలో తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ సెంట్రల్ ఫోరం డైరీని ఎంపీడీఓ శ్రీనివాస్,ఎంపిఓ రాము,పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం అసోసియేట్ అధ్యక్షులు జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి డి.శ్రీనివాస్ గౌడ్ తో కలిసి డైరీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిఆర్డిఓ సురేందర్ మాట్లాడుతూ మండల, గ్రామస్థాయిలో ఉన్న కార్యదర్శులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటు, గ్రామ అభివృద్ధికి, సంక్షేమపథకాల అమలుకు, పచ్చదనం పారిశుభ్రతకు తమవంతు కృషి చేయటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలం పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు రమేష్ చారి, కార్యదర్శులు అశోక్ రాథోడ్, నాగనాథ్, అంజయ్య, వికాస్ తోపాటు అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.
