దండం పెట్టి అడుగుతున్న.. చేయి గుర్తుకు ఓటేయండి – గనగాని శైలజ నర్సయ్య గౌడ..

దండం పెట్టి అడుగుతున్న.. చేయి గుర్తుకు ఓటేయండి – గనగాని శైలజ నర్సయ్య గౌడ..

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఓటరు మహాశయులరా.. దండం పెట్టి అడుగుతున్నా.. చేయి గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కౌన్సిలర్ గా తమను గెలిపిస్తే ప్రజలకు రుణపడి ఉంటామని 7 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గణగాని శైలజ నర్సయ్య గౌడ్ లు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి తమను కౌన్సిలర్ గా గెలిపిస్తే.. వార్డులోని సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

డ్రైవర్స్ కాలనీ, పద్మశాలి కాలనీ, శ్రీ వెంకటేశ్వర కాలనీ , వడ్డెర కాలనీ, సీమ టాకీస్ ఏరియాలో పూర్తిస్థాయిలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి శాశ్వత పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తామని.. తమను నమ్మి ఈ ఒక్కసారి అవకాశం కల్పించాలని ఓటర్ దేవుళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు.

Leave a Reply