Asifabad | ఇంటింటా ఎన్నికల ప్రచారం
Asifabad | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ మండలంలోని మానిక్ గూడ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న ఆత్రం మారు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మానిక్ గూడ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈసందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించడానికి కృషి చేస్తానని, వర్షాకాలంలో కోతకు గురైన రోడ్డు నిర్మాణం కోసం నాయకుల సహాయంతో నూతన రోడ్డు నిర్మించడానికి కృషి చేస్తానన్నారు. ఐదు సంవత్సరాలు ప్రజలకు అండగా ఉంటూ సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చరణ్, మహేష్ గౌడ్, బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.

