ఆసియా కప్ టీ20లో భాగంగా నేడు జరుగుతున్న పోరులో భారత్ – పాక్ జట్లు తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ, “మా జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది. స్కోర్ బోర్డ్‌పై మంచి స్కోరు సాధించి భారత్‌పై ఒత్తిడి తీసుకురావడమే మా లక్ష్యం” అని తెలిపారు.
మరోవైపు భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, “మేమూ కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కాబట్టి టాస్ ఫలితంతో సంతృప్తిగా ఉన్నాం. పిచ్ చాలా అనుకూలంగా ఉంది.” అని తెలిపారు.
ఇక జట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
భారత్:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు సాంసన్ (wk), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
పాకిస్తాన్:
సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయ్యూబ్, మొహమ్మద్ హారిస్ (wk), ఫఖర్ జమాన్, సల్మాన్ అలీ ఆఘా (c), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముకీమ్

