• సూర్యకు డిప్యూటీగా శుభ్ మ‌న్ గిల్..?
  • ఆసియా కప్ వైస్ కెప్టెన్ గా..!


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఆసియా కపు (Asia Cup) బీసీసీఐ (BCCI) మరికొన్ని రోజుల్లో భారత జట్టును ప్రకటించనుంది. జట్టు ఎంపిక (Indian squad )పై సెలెక్టర్లు (team selection) కసరత్తు చేస్తున్నారు. టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ (Shubman Gill) కు చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తుంది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ లో గిల్ అనుభవాన్ని టీమ్ మేనేజ్మెంట్ ఉపయోగించు కోవాలని భావిస్తున్నది. దాదాపు ఏడాది తర్వాత అతను టీ20ల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. గతేడాది జూలైలో శ్రీలంక (Sri Lanka) పై చివరిగా పొట్టి మ్యాచ్ ఆడాడు.

ప్రస్తుతం టీ20 జట్టు కెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న అతను ప్రస్తుతం ఎన్సీఏలో ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఆసియా కప్ లో సూర్యకు డిప్యూటీగా గిలు బీసీసీఐ ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లో అక్షర్ స్థానంలో గిల్ ను వైస్ కెప్టెన్సీ (T20I vice-captain) ఇవ్వాలని బోర్డు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ సూర్య ఫిట్ నెస్ సాధించడంలో విఫలమైతే గిల్ కే సారథ్య బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల ఇంగ్లాండ్ (England) గడ్డపై తొలి టెస్టు సిరీస్ లోనే టెస్టు కెప్టెన్ గా గిల్ ఆకట్టుకున్నాడు. అతని నాయకత్వంలో భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ ను 2-2తో సమంగా ముగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే జట్టు పగ్గాలు కూడా గిల్ అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు అతన్నేసారథిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply