దుబాయ్ : ఆసియా కప్ 17వ ఎడిషన్ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఢిఫెండింగ్ ఛాంపియన్ గా మరోసారి టైటిల్‌ను గెలుచుకునేందుకు సిద్ధంగా ఉంది. టీ20 ప్రపంచ కప్‌కు కేవలం నాలుగున్నర నెలల ముందు జరుగుతున్న ఈ టోర్నీ అన్ని దేశాలకు ఒక కీలకమైన పరీక్షగా నిలవనుంది. ముఖ్యంగా, భారత్‌కు ఇది టైటిల్ కోల్పోతే తీవ్ర విమర్శలు ఎదుర్కొనే టోర్నీ.
క్రికెట్ లవర్స్ దృష్టి ప్రస్తుతం దుబాయ్ పైనే ఉంది. రేపు (మంగళవారం) ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్… గ్రూప్ బి జట్లు ఆఫ్ఘనిస్తాన్ – హాంకాంగ్ మధ్య మ్యాచ్ తో ప్రారంభం కానుంది.
ఇక, భుధవారం భారత్ తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ లో భారత జట్టు ఆతిథ్య జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఢీకొట్టనుంది. భారత జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేనప్పటికీ… భారత్ కు భారీ విజయావకాశాలు ఉన్నాయి. టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఎనిమిది టైటిళ్లతో భారత్ నిలిచింది. ఇప్పుడు రికార్డును మరింత పెంచుకునే తొమ్మిదో టైటిల్ కోసం కన్నేసింది.
ఈ టోర్నమెంట్ చరిత్రలో ఎనిమిది టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన భారత్… ఇప్పుడు తొమ్మిదో టైటిల్‌తో తన రికార్డును పెంచుకోవాలని చూస్తోంది.
టీమిండియా మ్యాచ్ లు & టోర్నమెంట్ షెడ్యూల్
భారత్ తన ప్రయాణంలో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో సెప్టెంబర్ 14న దుబాయ్ లో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్ తో జరగనుంది.
ఎనిమిది జట్లను రెండు గ్రూపులు
- గ్రూప్ ఎ: భారత్, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్
- గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్
అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరగనున్నాయి..
టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ :
- సెప్టెంబర్ 09: ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్
- సెప్టెంబర్ 10: భారత్ vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
- సెప్టెంబర్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్
- సెప్టెంబర్ 12: పాకిస్తాన్ vs ఒమన్
- సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక
- సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్
- సెప్టెంబర్ 15: యూఏఈ vs ఒమన్, శ్రీలంక vs హాంకాంగ్
- సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్
- సెప్టెంబర్ 17: పాకిస్తాన్ vs యూఏఈ
- సెప్టెంబర్ 18: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్
- సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్
గ్రూప్ దశ తర్వాత, సూపర్ ఫోర్ దశ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో షెడ్యూల్ చేయబడింది.
స్ట్రీమింగ్ అప్డేట్ !
భారతదేశంలో, అభిమానులు అన్ని మ్యాచ్ లను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్షంగా చూడవచ్చు. సోనీ లైవ్ యాప్, వెబ్ సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.