ASG | అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్‌

ASG | అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్‌

ASG | ఢిల్లీ, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) పోస్టులకు మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) తో పాటు దవీందర్‌పాల్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా నియమించింది. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదంతో న్యాయశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నియామకాలతో సుప్రీంకోర్టు (Supreme Court)లో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే లీగల్ టీమ్ మరింత బలోపేతమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కనకమేడల రవీంద్రకుమార్ గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆయనకు విస్తృతమైన లీగల్ అనుభవం ఉంది. దవీందర్‌పాల్ సింగ్ (Davinder Pal Singh) కూడా సుప్రీంకోర్టులో పలు కీలక కేసుల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవజ్ఞుడు. ఈ నియామకాలు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన కేసుల్లో బలమైన ప్రాతినిధ్యం అందించేందుకు దోహదపడతాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply