ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా..
- బీటీ నాయుడు బాధ్యతలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అసెంబ్లీలోనీ శాసన మండలి(Legislative Council) చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆధ్వర్యంలో ప్రివిలేజ్ కమిటీ(Privilege Committee) కొత్తగా ఏర్పాటైంది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు(B.T. Naidu) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
కమిటీ సభ్యులు జయేంద్ర భరత్(Jayendra Bharat), పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పందుల రవీంద్ర బాబు, రఘురాం తలసీల(Raghuram Talaseela), రాజగోళ్ల రమేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీటీ.నాయుడు మాట్లాడుతూ.. సభ్యుల హక్కులను కాపాడే దిశగా ఈ కమిటీ పనిచేస్తుందనీ, కొత్తగా బాధ్యతలు(Responsibilities) చేపట్టిన తాము సభా, సభ్యుల గౌరవం నిలబెట్టేలా కృషి చేస్తామని ప్రకటించారు.

