ARV vaccines | వ్యాక్సిన్ వేయించాలి..

ARV vaccines | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో ఆదివారం పెంపుడు కుక్కలకు ఏఆర్ వి టీకాలు (వ్యాక్సిన్)లు ఇచ్చినట్లు వెటర్నరీ అసిస్టెంట్ రాథోడ్ సికిందర్ తెలిపారు. పెంపుడు కుక్కల గాని వీధి కుక్కల గాని వ్యాధి సోకినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా పశు వైద్యశాలకు తీసుకురావాలని వాటికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో ప్రత్యేకంగా కుక్కలకు వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇండ్లలో కుక్కలను సాదుకునే యజమానులు తమ కుక్కలను ఆస్పత్రి తీసుకువచ్చి టీకాలు వేయించాలని ఆయన కోరారు.
