Arunachal Pradesh | లోయలో పడిన వాహనం..

Arunachal Pradesh | లోయలో పడిన వాహనం..

22 మంది మృతి


Arunachal Pradesh | హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దేశవ్యాప్తంగా ఘాట్ రోడ్లపై వరుసగా రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన దుర్ఘటనలో 6 మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా నేడు అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh ) లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో 22 మంది మరణించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లా (Anjav District) లో ఇవాళ‌ ఈ విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చాగ్లగాం ప్రాంతంలో కార్మికులను తీసుకెళ్తున్న ట్రక్కు కొండపై నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఆ ట్రక్కులో ఇరవై ఇద్దరు కార్మికులు ఉన్నారు. వారందరూ ప్రమాదంలో మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు.. ఈ కార్మికులలో 19 మంది అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని గిలాపుకురి టీ ఎస్టేట్ నివాసితులుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యల్లో నమిగ్నమయ్యారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 13 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన కార్మికుల మృతదేహాల (workers Dead bodies) కోసం అన్వేషణ జరుగుతోంది.

గురువారం హైలాంగ్-చాగ్లఘం రోడ్డులోని మెటెంగ్లియాంగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులందరూ అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని గెలాపుఖురి టీ ఎస్టేట్ (Gelapukhuri Tea Estate) కు చెందినవారు. కాంట్రాక్టుపై పని చేయడానికి వారు అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రాజెక్ట్ సైట్‌కు ప్రయాణిస్తున్నారు. ఇరుకైన మలుపులు, నిటారుగా దిగులు, లోతైన లోయలతో కూడిన ప్రమాదకరమైన రహదారిపై ఈ ఘటన జరిగింది.

మృతుల్లో బుధేశ్వర్ దీప్, రాహుల్ కుమార్, సమీర్ దీప్, జాన్ కుమార్, పంకజ్ మంకీ, అజయ్ మంకీ, బిజయ్ కుమార్, అభయ్ భూమిజ్, రోహిత్ మంకీ, బీరేంద్ర కుమార్, అగోర్ తంతి, ధీరేన్ చెటియా, రజనీ నాగ్, దీప్ గోవాలా, రామ్‌చ్‌బాక్ సోనార్, సొనాతన్ నాగ్, సంజయ్ కుమార్, కరణ్, కరణ్, కరణ్, కరణ్, జోన కుమార్, కరణ్, జోన మరో ముగ్గురు కార్మికులను ఇంకా గుర్తించలేదు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే కారణం తెలుస్తుందని అంజా డిప్యూటీ కమిషనర్ మిలో కోజిన్ తెలిపారు.

Leave a Reply