- టెక్ దిగ్గజాల ఎమంటున్నారంటే !
ఈ మధ్య కాలంలో మనల్ని మనమే మరిచిపోతున్నట్టు ఉంది! ఎందుకంటే ఏ విషయమైనా చిన్నదీ, పెద్దదీ.. తెలిసినది, తెలియనిదీ ఇలా ప్రతీ దానికి ఏఐనే వాడేసుకుంటూన్నారు. మన మేధస్సు మీద కాకుండా… ఏఐ (కృత్రిమ మేధ) మీదే పూర్తిగా ఆధారపడిపోతున్నాం. ఉదాహరణకి, దారితెలుసుకోవాలన్నా, వంటల రుచి పెరగాలన్నా, ఇంటర్వ్యూకి రెడీ అవాలన్నా ప్రతిదానికీ గూగుల్, చాట్‌బాట్‌లు, ఏఐ టూల్స్ వద్దరకు పరుగులు తీస్తున్నాం.
ఇప్పటికి చాలామంది ‘ఒక్కసారి గూగుల్ చెక్ చేయాలి’, ‘దీని మీద యూట్యూబ్‌లో చూడాలి’, ‘చాట్‌జీపీటీలో అడుగుదాం’ అని తలచుకుంటున్నారు. ఇది చూస్తే భవిష్యత్తులో మన మెదడు పని చేయడమే మర్చిపోతుందేమో అనిపిస్తుంది. మనం ఆలోచన చేసే సామర్థ్యాన్ని, విషయాలను విశ్లేషించే శక్తిని మెల్లగా పక్కన పెడుతున్నాం. అని డీప్ మైండ్ (DeepMind) అనే ప్రపంచ ప్రఖ్యాత ఏఐ సంస్థ సీఈఓ డెమిస్ హస్సాబిస్ మాత్రం స్పష్టంగా చెప్పారు
“ఏఐ గొప్పది, సహాయకారి. కానీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదు. మన మెదడు పనిచేయకుండా కృత్రిమ మేధపై పూర్తిగా ఆధారపడితే అది సరి కాదని” హెచ్చరించారు.

ప్రస్తుత తరంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి వేగంగా జరుగుతోంది. అయితే, ఏఐ మేధస్సు అభివృద్ది చెందుతున్నంత మాత్రానా మానవ మేధస్సు మసకబారిపోకూడదు. ఇదంతా మనం ఏఐ ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనకు AI మద్దతు అవసరమైతే, మనం దానిని తీసుకోవచ్చు… కానీ ఏఐ మీదనే మొత్తం బాధ్యత వదిలేయకూడదు కదా!
మనం బలమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, మన ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మనిషి గొప్పతనం ఆలోచించే, విశ్లేషించే, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలోనే ఉంటుంది. దానిని సజీవంగా ఉండాలంటే మనం ఆలోచించడం మర్చిపోకుండా, మన మెదడును కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి.
కాగా, కొద్ది రోజుల క్రితం చాట్ జీపీటీ సీఈవో శామ్ ఆల్టమన్ కూడా ఇదే విషయం మీద చర్చించారు. AI విషయంలో జర జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. AI విషయంలో ఏదీ రహస్యం కాదని, చట్టపరమైన సమస్యలు తలెత్తినప్పుడు, న్యాయస్థానాలు అడిగితే ఏఊ వద్ద ఉన్న వినియోగదారులు మొత్తం సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
అలాగే, ఏఐ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది ఇచ్చే సమాచారంపై అతి విశ్వాసం మంచిదికాదన్నారు. ఏఐ మొడల్స్ కొన్ని యూజర్ల అవసరాలు తీర్చేందుకు కొన్నిసార్లు వాస్తవాలతో రాజీపడి కల్పిత సమాచారాన్ని సృష్టిస్తుంటాయని తెలిపారు.
ఎవరేమన్నా…మన జీవన పరిణామ క్రమంలో మార్పు అనేది అనివార్యమైనది. దానిని ఎవ్వరూ అడ్డుకోలేరు, ఆపలేరు. చివరకు ఆ మార్పుకి నాంది పలికిన వారు కూడా. ఏ ఐ మీద ఆధారపడడం మనమే కాస్త తగ్గించుకుంటూ ఉంటే భవిష్యత్తులో మన మెదళ్ళు నిరుపయోగమైపోకుండా ఉంటాయన్నమాట.
చూద్దాం…