Arrested | గౌత‌మ్ గంబీర్ కు బెదిరింపులు – గుజ‌రాత్ లో ఒక‌రి అరెస్ట్

న్యూఢిల్లీ – టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రాణహాని బెదిరింపుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత జట్టు మాజీ దిగ్గజ బ్యాటర్, ప్రస్తుత కోచ్ అయిన గంభీర్‌కు ఇటీవల బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన రోజునే గంభీర్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. పహల్గాం దాడి రోజే బెదిరింపులు:

ఐపీఎల్ 2025 కారణంగా ప్రస్తుతం విరామంలో ఉన్న గౌతమ్ గంభీర్ ఏప్రిల్ 24న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని బెదిరింపులతో రెండు ఈమెయిల్స్ వచ్చాయని తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని రాజేందర్ నగర్‌లో నివసించే గంభీర్ అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో తనకు రెండు ఈమెయిల్స్ వచ్చాయని చెప్పారు. ఆ రెండు ఈమెయిల్స్‌లోనూ ‘IKillU’ (నేను నిన్ను చంపేస్తాను) అని రాసి ఉంది. ఈమెయిల్స్ పంపిన వ్యక్తి తనను తాను ISIS కాశ్మీర్ సభ్యుడిగా చెప్పుకున్నాడు.

Leave a Reply