Arrest | పోలీసుల అదుపులో 11మంది

Arrest | పోలీసుల అదుపులో 11మంది
Arrest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నగరంలోని మైలార్ దేవ్‌పల్లిలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హుక్కా సెంటర్ నిర్వహిస్తున్న తన్వీర్‌ను అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడి సందర్భంగా హుక్కా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సెంటర్‌లో అక్రమంగా హుక్కా సేవలు అందిస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో హుక్కా సెంటర్ల నిర్వహణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ హుక్కా సెంటర్లు నిర్వహించినా, లేదా వాటికి సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దళాలతో మరిన్ని దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. హుక్కా సెంటర్లకు ఎవరు కొమ్ముకాసినా, వ్యాపారానికి సహకరించినా చర్యలుంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
