బీఆర్ఎస్ నేతల అరెస్ట్...
ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి(Bhuvanagiri) పట్టణ కేంద్రంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలో ఆదివారం బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై గుంతలు పూడ్చక పోవడంతో రోడ్డు ప్రమాదాలు(accidents) ఎక్కువగా జరుగుతున్నాయని, ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
వెంటనే రోడ్డు పనులు చేపట్టాలన్నారు. రాస్తారోకో చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు(station) తరలించారు. ఈ కార్యక్రమంలో జనగాం పాండు(జనగాం పాండు), ఏవి కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, అంజనేయులు, ఓం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

