Arrest | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయలేదనే నేపంతో దాడి చేసిన నలుగురు వ్యక్తులను బోధన్ పోలీసులు(Bodan Police) శనివారం రిమాండ్ చేశారు. బోధన్ సర్కిల్ పరిధిలోని రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదనే కారణంతో ఇబ్రహీం, అబూబకర్ లు మరి కొంత మంది కలిసి చంపాలనే ఉద్దేశంతో ప్రార్ధన మందిరం(prardhana mandiram) సమీపంలో దాడి చేశారు.
దాడిలో జమీలుద్దీన్, అప్సర్, హైమద్ లు గాయపడ్డారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి దాడికి పాల్పడిన ఇబ్రహీం వాజీ అవేష్ అబూబకర్(Ibrahim Waji Avesh Abubakar) లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీళ్ళ వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు కత్తులు, ఏడు కర్రలు, ఐరన్ రాడ్, ఒక కార్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్ పాల్గొన్నారు.

