Army | ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం

Army | ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం

Army | నారాయణపేట, ఆంధ్రప్రభ : దామరిగిద్ద మండలం బాపన్ పల్లిలో ఏర్పాటు చేసిన మిల్కసింగ్ ఆర్మీ ట్రైనింగ్(Milking Army Training) అకాడమీ కృషి అభినందనీయం అని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ బాపన్ పల్లి ఏకగ్రీవ సర్పంచ్ గవినోల్ల శ్రీనివాస్ అన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ రోజు అగ్నివీర్ కు ఎంపిక అయిన‌ భారత ఆర్మీ జవాన్ లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అయ్యార్పల్లి రాఘవేంద్ర రెడ్డి, పి ఈ టీ రమణ, వార్డు మెంబెర్స్ మెట్టు నర్సింహా, దేవేందర్, నాగయ్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవ త్సరం బాపన్ పల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఆర్మీ అకాడమీ నుండి 60 మంది(60 people) ఎంపిక కావడం సంతోష దాయకమని అన్నారు.

ఈ అకాడమీ బాద్యులు కావలి మహేష్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. అకాడమీకీ వెన్నంటి ఉన్న గవి నోళ్ల ఉదయ్(Gavi Nolla Uday)కీ అభినందనలు తెలిపారు. రాఘవేంద్ర రెడ్డి అకాడమీకీ వెన్నంటే ఉండి సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సంవత్సరం ఈ బాపన్ పల్లిలో ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా జిల్లా వ్యాప్తంగా యువతకీ శిక్షణ యిచ్చే విధంగా ఏర్పాటు చెయ్యాలి అని అకాడమీ బాద్యులకు సూచించారు. దానికి అయ్యే ఖర్చు కూడా భరిస్తా అని చెప్పారు. బాపన్ పల్లిలో ఇంతవరకు 12 మంది ఆర్మీకీ ఎన్నిక కావడం సంతోషం అన్నారు. ఆర్మీకీ ఎంపిక అయిన అందరికి శుభాకాంక్షలు తెలిపి వారికి సన్మానం చేసి దేశ సేవకు ముందుకు రావడం సంతోషం అన్నారు.

Leave a Reply