Arigela Janardhan | పిప్రి సర్పంచ్ గా అరిగేల గెలుపు

Arigela Janardhan | పిప్రి సర్పంచ్ గా అరిగేల గెలుపు
Arigela Janardhan | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మండలం పిప్రి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అరిగేల జనార్దన్ విజయం సాధించారు. గ్రామంలో సర్పంచ్ స్థానం కొరకు ఆరుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 1164 ఓట్లు పోలవ్వగా అందులో జనార్దన్ ఉంగరం గుర్తుకు 747 ఓట్లు పోలయ్యాయి. సమీప అభ్యర్థి కత్తెర గుర్తుకు 292 ఓట్లు వచ్చాయి. దాంతో అధికారులు అరిగేల జనార్దన్ 455 ఓట్ల మెజారిటీ తో గెలుపొందినట్టు ప్రకటించారు. జనార్దన్ విజయంతో గ్రామంలో యువకులు సంబురాలు నిర్వహించారు. తనకు అండగా నిలిచిన మహిళలకు, యువతకు, సహచర మిత్రులకు సర్పంచ్ గా విజయం సాధించిన జనార్దన్ కృతజ్ఞతలు తెలిపారు.
