Argument | టీడీపీ, వెర్సెస్ బీజేపీ

Argument | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం న్యూ హోసింగ్ బోర్డు వద్ద టీడీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య స్వల్ప వాగ్వావాదం నెలకొంది. న్యూ హోసింగ్ బోర్డు రింగ్ వద్ద వాజపేయి(Vajpayee) విగ్రహా నిర్మాణానికి శంఖస్థాపన చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు. 2014లోనే ఎన్టీఆర్ మార్గ్ నామకరణం చేసి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం చేశామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. హోసింగ్ బోర్డు రింగ్ లో బైఠాయించి టీడీపీ నాయకులు నిరసన(protest) వ్యక్తం చేశారు. ఒక వైపు బీజేపీ నాయకులు, మరో వైపు టీడీపీ నాయకులు చేరడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోడ్డుపైన బీజేపీ నాయకులు బైఠాయించారు.
