ప‌ది ఎక‌రాల‌కు రెండు బ‌స్తాలు స‌రిపోతుందా?

మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ‌లో యూరియా గోస ప్ర‌భుత్వానికి ప‌ట్టడం లేద‌ని బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) అన్నారు. నెల రోజులుగా యూరియా అందక రైతులు గోసపడుతుంటే సీఎంకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. యూరియా కోసం పీఏసీఎస్‌(PACS)ల వద్ద చెప్పులు, పాసుపుస్తకాలు పెట్టి తెల్లవారుజామున మూడు గంటల నుండి వేచి ఉన్నదుష్టితి నెల‌కొంద‌న్నారు.

ఈ రోజు నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్ పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప‌ది ఎకరాల పొలానికి కనీసంగా 30 బస్తాల యూరియా అవసరమని, కానీ ఈ ప్రభుత్వం 10 ఎకరాల రైతుకు రెండు యూరియా బస్తాలు ఇస్తే ఏం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
ఏ రైతుకైనా నాట్లు వేసే సమయంలో ఒకేసారి యూరియా(Urea) అవ‌స‌రం ఉంటుంద‌ని చిట్టెం అన్నారు.

రైతులకు ఎవరికి సరిపడా వారికి యూరియాను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మక్తల్ మండలానికి 5800 మెట్రిక్ టన్నుల యూరియా(Metric Tons of Urea) అవసరముండగా ఇప్పటివరకు 3200 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేశార‌న్నారు. మిగతా 2600 మెట్రిక్ టన్నుల యూరియా ఎప్పుడు పంపిణీ చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలను తీసుకొని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నర్సింహ గౌడ్(Former Market Committee Chairman P. Narasimha Goud), బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు(BRS Town President Chinna Hanmanthu), నాయకులు జగ్గలి రాములు, మొగులప్ప, అన్వర్ హుస్సేన్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply