హిమాయత్ నగర్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా మండలి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు నేదునూరి శంకర్ గౌడ్ ని నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన టీతిరుమల తిరుపతి దావస్థానం సభ్యుల సమాన హోదాలో సలహా మండలి అధ్యక్షుడి విధి విధానాలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ నియామకానికి తన పేరు ప్రతిపాదించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికీ, సహకరించిన శాసన మండలి సభ్యులు నాగబాబు గారికీ హరిప్రసాద్ గారికీ, మరియు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా భక్తి భావంతోతో ఇంటింటికి తిరుమల శ్రీవెంకటస్వామి వారి లీలామృతం తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తానని, హిమాయత్ నగర్ టీటీడీ దేవాలయం అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు.

