Peddapally | కొత్త ఠాణాలకు అధికారుల నియామకం

  • మహిళా ఠాణా ఇన్ స్పెక్టర్ గా పురుషోత్తం
  • రూరల్ ఎస్ఐగా మల్లేశ్


పెద్దపల్లి, ఆంధ్రప్రభ : నూతనంగా మంజూరైన పోలీస్ స్టేషన్లకు అధికారులను కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా మంజూరైన పెద్దపల్లి (Peddapally) మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా పురుషోత్తం (Purushottam) ను నియమిస్తూ ఉత్తర్వులు వెల్లడించారు. పెద్దపల్లి రూరల్ ఎస్ఐగా మల్లేశ్ ను నియమించారు. నూతనంగా మంజూరైన ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా సత్యనారాయణను నియమించారు. పురుషోత్తం ప్రస్తుతం రామగుండం ఎస్ బి లో పనిచేస్తున్నారు.

రూరల్ ఎస్ఐగా నియమితులైన మల్లేశ్ (Mallesh) ప్రస్తుతం పెద్దపల్లి ఠాణాలో ఎస్ఐ 2గా పని చేస్తున్నారు. ఎలిగేడు ఎస్ఐగా నియమితులైన సత్యనారాయణ (Satyanarayana) ప్రస్తుతం మంచిర్యాల వీఆర్ లో ఉన్నారు. ఈ మూడు పోలీస్ స్టేషన్లలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత రెండు రోజులుగా ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యవేక్షించారు.

Leave a Reply