టెక్ ఔత్సాహికులు, ఆపిల్ ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం చివరకు రానే వచ్చింది. ఆపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో న్యూ ప్రొడ‌క్ట్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.

ఈసారి “Awe Dropping” పేరుతో నిర్వ‌హించ‌నున్న ఈ కార్య‌క్ర‌మం… సెప్టెంబర్ 9 (మంగళవారం) ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30) కుపర్టినోలోని ప్రధాన కార్యాలయం నుంచి లైవ్‌గా ప్రసారం కానుంది.

ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణ – iPhone 17 సిరీస్ !

ఈవెంట్‌లో iPhone 17 సిరీస్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఉండనున్నాయి:

iPhone 17 – 6.3 అంగుళాల డిస్ప్లే.

iPhone 17 Air – “Plus” మోడల్‌కి బదులుగా వస్తోంది. ఇప్పటివరకు అత్యంత సన్నగా ఉన్న iPhone (దాదాపు 5.5mm) ఇదే అవుతుంది.

iPhone 17 Pro & Pro Max – కొత్త “హారిజాంటల్ కెమెరా ఐలాండ్” డిజైన్. A19 Pro చిప్, 12GB RAM ఉంటాయి. Pro Max‌లో 48MP టెలిఫోటో లెన్స్ (8x ఆప్టికల్ జూమ్), అలాగే 5000mAh బ్యాటరీ.

🔹 అన్ని మోడళ్లలో ఫ్రంట్ కెమెరా 12MP నుండి 24MP కి అప్‌గ్రేడ్ అవుతుంది.
🔹 120Hz ProMotion OLED డిస్ప్లేలు అన్ని మోడళ్లలో అందుబాటులో ఉంటాయి.

ఇతర ఉత్పత్తులు

Apple Watch Series 11 – ప్రకాశవంతమైన స్క్రీన్, కొత్త చిప్, కొత్త రంగులు. రక్తపోటు కొలిచే ఫీచర్ కూడా ఉండొచ్చు.
Apple Watch Ultra 3 – పెద్ద స్క్రీన్, శాటిలైట్ కనెక్టివిటీ (నెట్‌వర్క్ లేకపోయినా మెసేజ్ పంపే అవకాశం), కొత్త S11 చిప్.
AirPods Pro 3 – కొత్త డిజైన్, కొత్త H3 చిప్. శబ్ద నియంత్రణ ఇంకా మెరుగ్గా ఉంటుంది. హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్ కొలిచే సెన్సర్లు ఉండొచ్చు.

iOS 26 – కొత్త iPhones ఇవే నడిపిస్తాయి. ఇందులో AI ఆధారిత కొత్త ఫీచర్లు, “Liquid Glass” అనే కొత్త డిజైన్ ఉంటాయి. కొత్త iPhones iOS 26, AI ఆధారిత కొత్త ఫీచర్లు, అలాగే కొత్త “Liquid Glass” డిజైన్ ఉంటుందని అంచనా.

Leave a Reply