కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..

ఎండపల్లి, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరా జాతరలో జరిగిన ఘటనలో రెండు నెలల శిశువు మృతి చెందిన విషయంలో టీ.ఎం.ఐ.వీ రాష్ట్ర నాయకులు చుంచు మల్లేశం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులపై తక్షణమే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని ఆయన కోరారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
