నిరుపేదలకు అపార్ట్మెంట్లు సిద్ధం…

  • న్యూఇయ‌ర్ నాటికి గృహప్రవేశాల
  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా.

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : ఇల్లు లేని నిరుపేదలకు జి ప్లస్ త్రి అపార్ట్మెంటులో ప్లాటును కేటాయించి, మౌళిక వసతులు కల్పించి, నూతన సంవత్సరం నాటికి గృహప్రవేశాలు కూడా చేయించి లబ్ధిదారులకు ఇల్లు అప్పగిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు.

గురువారం అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని జి ప్లస్ త్రి అపార్ట్మెంట్లను ఎమ్మెల్యే బొండా ఉమా సంబంధిత అధికారులతో కలసి పర్యవేక్షణ చేశారు. గత టీడీపీ హయాంలో పూర్త‌య్యి వైసీపీ ప్రభుత్వంలో గాలికి వదిలేసిన అపార్ట్మెంట్లు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తున్నామని ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు.

ఇక్కడ అపార్ట్మెంట్స్ ఆకతాయిలకు అడ్డాగా మారడంతో, ఇల్లు తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్ వైరింగ్ ఇలా అనేక వస్తువులు దొంగతనానికి గురైన్నాయి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికి కావలసిన వస్తు సామగ్రిని ఏర్పాటు చేసి పేదలకు ఇల్లు అప్పజెప్పడం జరుగుతుందని అన్నారు.

ఆకతాయులకు బుద్ధి చెప్పాలి…

నిర్మానుష్యంగా ఉన్న ఇళ్లను అడ్డాగా మార్చుకొని ఆకతాయిలు పెట్రేగిపోతున్నారని వారిని నిలువరించి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే బొండా ఉమా అజిత్ సింగ్ నగర్ పోలిసులకు ఆదేశాలు జారీచేశారు.

ఇటీవల సింగ్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పడంతో పలు అల్లర్లు, కొట్లాటలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు ఎమ్మెల్యే గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రాజానా బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, మరకా శ్రీనివాసరావు, లింగాల కిరణ్, గౌసియా, హౌసింగ్ పి. డి.గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply