మంగళగిరి : .పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వైసీపీ కి ఆయన గతంలోనే రాజీనామా చేశారు. జనసేనలో చేరతానని అప్పుడే ప్రకటించారు.. ఇందులో భాగంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పవన్ కల్యాణ్‌ను నేడు కలిశారు. జనసేనలో చేరే అంశంపై చర్చించారు.
2014లో ఓటమికాగా 2014లో పెండెం దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే 2019లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్ల పాటు వరకూ ప్రజలకు సేవలు అందించారు.
అయితే అనూహ్యంగా 2024లో వైసీపీ నుంచి ఆయనకు సీటు దక్కలేదు. మహిళా నేత, అప్పటి ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓటమి పాలయ్యారు
.2024 ఎన్నికల సమయంలోనే రాజీనామా నిర్ణయం
అయితే ఎన్నికల సమయంలోనే వైసీపీని వీడాలని పెండెం దొరబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాజీనామా ప్రకటనకు సిద్ధమయ్యారు. అయితే వైసీపీ అధినేత జగన్ బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఈ మేరకు జనసేనలో చేరేందుకు తాజాగా సర్వం సిద్ధం చేసుకున్నారు. తాజాగా, నేడు తన కుటుంబ సభ్యులతో కలసి పవన్ నివాసానికి వెళ్ళారు . జనసేనలో చేరికపై చర్చించారు. ఈ సందర్భంగా దొరబాబు కు పవన్ లైన్ క్లియర్ చేసారు. దీంతో అయన త్వరలో అధికారికంగా జన సేన లో చేరనున్నారు.