ఓర్వకల్ ( ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలోని శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆలయంలోకి దొంగలు చొరబడ్డారు. దొంగలు ఐదు హుండీలను పగలగొట్టి నగదును దోచుకున్నారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గర్భగుడి వెనుక ఉన్న గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
గర్భగుడిలోని ఐదు హుండీల తాళాలు పగలగొట్టి లోపల ఉన్న నగదును దోచుకెళ్లిన దొంగలు.. ఆ తర్వాత హుండీలను తీసుకొని కోనేరు సమీపంలోని వాగులో విసిరేశారు. సిబ్బంది, ఆలయ పూజారులు ఉదయం స్వామివారిని పూజించడానికి రాగా.. హుండీలు లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు.
ఈ దొంగతనం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఐదు ఉండిలలో దాదాపుగా 40 వేలకు పైగా నగదు ఉంటుందని తెలుస్తుంది. కర్నూలు జిల్లాలోని శైవ క్షేత్రమైన బుగ్గ రామేశ్వర ఆలయంలోకి దొంగలు చొరబడ్డారని తెలుసుకున్న ప్రజలు, శివయ్యకు రక్షణ లేదా అని చర్చించుకుంటున్నారు. ఈ దొంగతనం పోలీసులకు సవాలుగా మారింది. సిసి పుట్టినరోజు ఆధారంగా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.